*12వ వేజ్ బోర్డ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి*
*కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన*
* *మన ప్రజావాణి*, మందమర్రి:- జూలై 1
దేశ వ్యాప్త బొగ్గు గని కార్మికులకు నేటి నుంచి ప్రారంభం కావలసిన 12వ వేతన ఒప్పందంనకు సంబంధించి జేబిసిసిఐ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి, సమావేశాలు నిర్వహించి, మెరుగైన వేతన ఒప్పందం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వేజ్ బోర్డ్ కమిటీ నియమించడానికి జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా జేఏసీ కార్మిక సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన డిమాండ్ డే పిలుపులో భాగంగా బుధవారం ఏరియాలోని కేకే 5, కేకే ఓసిపి, ఏరియా వర్క్ షాప్, సివిల్ డిపార్ట్మెంట్, ఎస్ అండ్ పిసి, ఏరియా స్టోర్స్ తదితర ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో జేఏసీ నాయకులు ద్వార సమావేశాలు నిర్వహించి, వేజ్ బోర్డ్ ఆలస్యానికి నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి, నిరసన వ్యక్తం చేస్తూ, సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, నేడు బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఆలసత్యానికి బిజెపి సర్కార్ కారణమని ఆరోపించారు. 4 లేబర్ కోడ్ ల విధానాల వలన కార్మిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. 4 లేబర్ కోడ్ ల విధానాన్ని పక్కకు పెట్టి వెంటనే 12 వ వెజ్ బోర్డు కమిటీ వేయించి, ఒప్పందం చేసుకొని, కార్మికులకు నూతన వేతనాలు అందజేయాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 12వ వేజ్ బోర్డు
పరిష్కారం కానీ ఎడల జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో సమ్మె చేయక తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
ఏఐటీయూసీ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, భీమానాథుని సుదర్శన్, కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం, ఈ రాజేశ్వర్ రావు, ములకలపల్లి వెంకటేశ్వర్లు, విక్రమ్ సింగ్, తోట వెంకటస్వామి, గోపతి సత్యనారాయణ, గాండ్ల సంపత్ కుమార్, సిహెచ్పి శర్మ, మర్రి కుమారస్వామి, సంజీవ్ కుమార్, కలవల శ్రీనివాస్, ఐఎన్టియుసి నాయకులు భీమారపు సదయ్య, రాజేందర్, స్వామి, రాజేందర్, ఓరం మధు, టిబిజికేఎస్ తాళ్లపల్లి సారయ్య సీపెళ్లి రాయలింగు
ఏఐటీయూసీ, ఐఎన్టియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్ పాల్గొన్నారు.
