*బాన్సువాడలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం –ఏరైవ్ -ఏ లైవ్ “అవగాహన రహదారి భద్రత అవగాహన – రవాణా శాఖ, కామారెడ్డి.*
సాక్షి డిజిటల్ న్యూస్
ఏప్రిల్:16
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
పిట్ల.అనిల్ కుమార్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాన్సువాడలో రవాణా శాఖ ఆధ్వర్యంలో “ ఏ లైవ్ ఏ రైవ్ ” (సురక్షితంగా చేరుకోండి) ఇతివృత్తంతో డ్రైవర్లు మరియు సాధారణ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డి సి హెచ్ ఎస్ ) విజయభాస్కర్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి . విద్య, జిల్లా డీఎంహెచ్వో అధికారి (డి ఎస్ ఐ ఓ ) రోహిత్, సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఏ ఎం బి ఐ) లు
మధుకర్ , కృష్ణ తేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డి సి హెచ్ ఎస్ .విజయభాస్కర్ మాట్లాడుతూ, వయసుతో వచ్చే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
డి ఐ ఓ. రోహిత్ ప్రధమ చికిత్స మరియు సిపిఆర్ (సి ఆర్ పి ) విధానాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సహాయం అందించడం ప్రాణాలను కాపాడగలదని తెలిపారు.
జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, డ్రైవర్ల ఆరోగ్యం రహదారి భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మరియు వైద్య శాఖ సిబ్బంది పాల్గొనగా, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు మరియు ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.