prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:10 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

“*బాబా సాహెబ్ కు కాకాణి ఘన నివాళి”*

 

*SPSR నెల్లూరు జిల్లా*

*తేది 14.04.2026*

 

*శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్బంగా శాసన మండలి సభ్యులు మేరీగ మురళి ధర్ గారు,సూళ్లూరుపేట మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు,ఆత్మకూరు మాజీ శాసన సభ్యులు మేక పాటి విక్రమ్ రెడ్డి గారు, రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సామాజిక, సమానత్వం, కోసం పోరాడిన మహానేత బి.ఆర్. అంబేద్కర్  సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించిన మహోన్నత నేత అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి జయంతిని దేశవ్యాప్తంగా ‘సమానత్వ దినోత్సవం’ (Equality Day) గా జరుపుకుంటున్నారు.అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి మరువలేనిది.ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండి, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశారుఅంబేద్కర్ గారు అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, మహిళా సాధికారత మరియు కార్మిక హక్కుల కోసం అనేక సంస్కరణలు తెచ్చారు*

 

*అంబేద్కర్ గారు 64 సబ్జెక్టులలో పట్టు సాధించి, 9 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన అరుదైన మేధావి*

 

*”బోధించు, సమీకరించు, పోరాడు” అనే ఆయన నినాదం నేటి యువతకు నిరంతర స్ఫూర్తిదాయకం.*

 

*స్వతంత్ర భారత తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు*

 

*నేటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగ విలువల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత*,

 

*ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా , మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా అడుగులు వేసిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి.విజయవాడ నడిబొడ్డున సామాజిక న్యాయ శిల్పం పేరిట, 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, రాజ్యాంగబద్ధంగా బడుగు, బలహీన వర్గాలకు, రాజకీయ అవకాశం కల్పించడమే కాకుండా, రిజర్వేషన్లకు అతీతంగా మరి ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించి, సామాన్యుడు, బీద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు, రాజ్యాధికారం వైపు అడుగులు వేసే విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ భావితరాలకు ఆదర్శం మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేస్తామని మరొక్కసారి ప్రతినభూనుతున్నాం