కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)ఖాజీపేట మండలం కొత్తపేట గ్రామంలో గ్రామీణాభివృద్ధికి ఊపిరి పోస్తూ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్లు అభివృద్ధి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడే ఈ పనులు ప్రజల్లో కొత్త ఆశలను నింపాయి.ఈ సందర్భంగా ఉపాధిహామి నిధులతో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన శ్మశానవాటికను ఎమ్మెల్యే ప్రారంభించారు.గ్రామ ప్రజలకు అవసరమైన ముఖ్య సదుపాయాలలో శ్మశానవాటిక ఒకటని,ఇది అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆయన తెలిపారు.అదేవిధంగా సుమారు రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు.ఈ...