హైదరాబాద్ యువకుడు మోసెస్ దేవదాస్‌కు గిన్నిస్ ప్రపంచ రికార్డు గౌరవం

ఘాట్ కేసర్ జూన్ 7 : ఘాట్ కేసర్ మండలానికి చెందిన యువకుడు మోసెస్ దేవదాస్ ప్రతిష్టాత్మక గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాద్యకారులు ఒకే వేదికపై పాల్గొన్న సంగీత కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ రికార్డు కార్యక్రమాన్ని హల్లెల్ సంగీత పాఠశాల ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ అంతర్జాతీయ సంగీత మహోత్సవంలో 22 దేశాలకు చెందిన సుమారు...