*హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ –2026 లో భాగంగా క్రీడాకారులకు సుమారు రూ.1,50,000 విలువైన క్రీడా సామాగ్రిని కోదాడ క్రికెట్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ ప్రాంతంలో అపారమైన క్రికెట్ ప్రతిభ దాగి ఉందని, సరైన శిక్షణ, క్రమశిక్షణతో ఇక్కడి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.క్యాంప్ విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నల్గొండ జిల్లా క్రికెట్...