మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి); హైదరాబాద్‌లో జరిగిన హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎస్.సురేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి డి.ఎల్. పాండు పై 275 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు ప్రకటించగానే న్యాయవాదుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. సహచర న్యాయవాదులు ఆయనను ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… బార్ సభ్యుల సంక్షేమం, న్యాయవాదుల సమస్యల పరిష్కారం, హైకోర్టు బార్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఎన్నికల అనంతరం ఆయన అనుచరులు సంబరాలు జరుపుతూ విజయోత్సవాలు నిర్వహించారు.