*హైకోర్టు తీర్పును దాచి అబద్ధపు ప్రచారాలా? – ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని తెలుసుకోండి!* * *నిజం నిలకడ మీద తెలుస్తుంది.. అబద్ధం ఆర్భాటంగానే చస్తుంది* * *అన్నోజిగూడ భూములపై అసత్య కథనాలపై మండిపడ్డ యజమానులు.* * *1955 నాటి ప్రభుత్వ తప్పును ఎత్తిచూపిన హైకోర్టు.. రికార్డులు సరిచేయాలని ఆదేశం.* * *తప్పుడు ప్రచారం చేసేవారితో బహిరంగ చర్చకు సిద్ధం – లేఅవుట్లలో పార్కు స్థలాల అమ్మకాల భాగోతం బయటపెడతాం*
ఘాట్ కేసర్, జులై 31 :"అబద్ధానికి రెక్కలొస్తే ఆకాశమంత ఎగురుతుంది కానీ.. నిజం ఒక్కసారి అడుగు బయటపెడితే ఆ అబద్ధం అడ్రస్ లేకుండా పోతుంది" అన్న చందంగా తయారైంది మేడ్చల్-మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడలోని భూముల వ్యవహారం. గత కొద్ది రోజులుగా కొన్ని పత్రిక సంస్థల్లో, సామాజిక మాధ్యమాలలో అన్నోజిగూడలోని సర్వే నంబర్లు 88, 89, 90, 91, 92లలోని పట్టా భూములను 'ప్రభుత్వ భూములు'గా చిత్రీకరిస్తూ, 'రియల్ మాఫియా అరాచకం' అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా...