హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి అక్రమ కంకర క్వారీలు క్రషర్ యూనిట్లను తొలగించాలి రాళ్లకత్వ గ్రామస్థుల వినతి

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి.. అక్రమ కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లను తొలగించాలి రాళ్లకత్వ గ్రామస్థుల వినతి *ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన జిన్నారం, జూలై 4(ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులో అక్రమంగా కొనసాగుతున్న కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లను వెంటనే నిలిపివేసి తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మండల తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామ శివారులో హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లు కొనసాగుతున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి...