గాగిల్లాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
బెజ్జంకి,ఏప్రిల్ 13(ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం న సర్పంచ్ జానకి రాజు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, కల్లేపల్లి లక్ష్మి, మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, ఏఎన్ఎం రాధ తదితరులు పాల్గొన్నారు.