prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 9:54 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన ఈ నెలాఖరు వరకు ఈ కేవైసీ పూర్తి చేయండి

హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన ఈ నెలాఖరు వరకు ఈ కేవైసీ పూర్తి చేయండి మధుబాబు

రామచంద్రపురం,జూన్25(ప్రజావాణి):హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులందరూ ఈ నెలాఖరు లోపు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని హెచ్‌పీ గ్యాస్ కంపెనీ బీహెచ్‌ఎల్ బ్రాంచ్ మేనేజర్ మధుబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాస్ కనెక్షన్‌ల వివరాల ధృవీకరణ కోసం ఈ-కేవైసీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వినియోగదారులు ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో సమీప హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని సంప్రదించి వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఈ-కేవైసీ చేయించుకోవాలని మధుబాబు విజ్ఞప్తి చేశారు.