prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:45 am Digital Edition : PRAJA VANI

హృదయాలను హత్తుకున్న అన్నదానం <br>

హృదయాలను హత్తుకున్న అన్నదానం..

సుందిల్ల గ్రామ శివాలయ అర్చకులు,రుద్రబట్ల పురుషోత్తం శర్మ ఇటీవల అనారోగ్య కారణంగా మరణించగా,ఆయన జ్ఞాపకార్థం బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజ లింగు,సుందిల్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ గర్రేపల్లి సదానందం,గ్రామ శాఖ అధ్యక్షుడు బొగిరి భాస్కర్ ల సూచన మేరకు సుందిల్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మల రాజిరెడ్డి,మేకల నర్సయ్య , బొగిరి తిరుపతి,అన్నం సంతోష్,పీక సతీష్, దుస్స మల్లేష్,కనుకుల సతీష్, బొగోరి దివాకర్,లు కలిసి పూజారిగా శివాలయానికే కాకుండా గ్రామ పూజారిగా రుద్రబట్ల పురుషోత్తం శర్మ అందించిన సేవలు,రుద్రబట్ల కుటుంబ సేవలు మరిచిపోము మహానుభావుడ,మి మరణం తీరని లోటు అంటూ బాధాతప్త హృదయాలతో మంచిర్యాల సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం వందమందికి హృదయాన్ని కదిలించే అన్నదాన,స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పేద పిల్లలకు,కూలీలకు,చిన్నారులు, నిరుపేద కుటుంబాలకు భోజన ప్యాకెట్లు,తాగునీటి సీసాలు పంపిణీ చేసి వారి ఆకలి తీర్చారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ…జీవితాంతం భక్తి,సేవాభావంతో ప్రజలకు ఆదర్శంగా నిలిచిన పురుషోత్తం శర్మ సేవలను స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు.
అన్నదానం అందుకున్న చిన్నారులు,కూలీలు సిరి ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని గ్రామస్థులు ప్రశంసించారు.ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప దానం అనే సందేశాన్ని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంది.