prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 6:29 am Digital Edition : RAJASHEKARREDDY

హుస్నాబాద్ నుండి బెజ్జంకి బస్సు ప్రారంభం

హుస్నాబాద్ నుండి బెజ్జంకి కీ బస్సు సర్వీస్ ప్రారంభం

బెజ్జంకి,మార్చి 26(ప్రజావాణి)

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హుస్నాబాద్ బస్ స్టేషన్ నుండి బెజ్జంకి కీ బస్సు సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి వయా మైసంపల్లి, చంచల్ చెరువుపల్లి, కోహెడ మీదుగా బెజ్జంకి 10 గంటల వరకు చేరుకుంటదని తెలిపారు. తిరిగి బెజ్జంకి నుండి ఉదయం 10:10 కీ బయలు దేరి 11:20 గంటల వరకు చేరుకుంటదన్నారు. ఈ యొక్క బస్సు రాకతో కోహెడ, బెజ్జంకి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.