హుస్నాబాద్ గౌరవం పెరిగేలా మున్సిపల్ పాలకవర్గం అధికారులు పనిచేయాలి :రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు…

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి హుస్నాబాద్ గౌరవం పెరిగేలా మున్సిపల్ పాలకవర్గం  అధికారులు పనిచేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై అవగాహన మరియు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించి మాట్లాడుతూ నేను 2009-2014 మధ్య పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు...