prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:08 am Digital Edition : PRAJA VANI

హుజురాబాద్ రాజకీయాల్లోకలకలంరేగిందిసామాజిక కార్యకర్త సబ్బని వెంకట్.కు బెదిరింపులు దాడి<br>

హుజురాబాద్.రాజకీయాల్లోకలకలంరేగిందిసామాజిక కార్యకర్త సబ్బని వెంకట్.కు బెదిరింపులు దాడి

* హుజురాబాద్ రాజకీయాల్లో కలకలం

* సబ్బని వెంకట్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమోదు

* దాడి బెదిరింపులు సోషల్ మీడియా దుష్ప్రచారంపై కేసు నమోదు విచారణ ప్రారంభం

జమ్మికుంటఆగస్టు 5 (ప్రజావాణి)

హుజురాబాద్ రాజకీయాల్లో మరోసారికలకలంరేగిందిసామాజిక కార్యకర్త సబ్బని వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి ప్రాణహాని బెదిరింపులు పరువు నష్టం కలిగించే చర్యలు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినట్లు ఆరోపిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.సబ్బని వెంకట్ తన ఫిర్యాదులో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ప్రమేయం ఉందని ఆరోపించారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం డంపింగ్ యార్డ్ సమస్యతో పాటు స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం వల్లే రాజకీయ కక్షతో తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఫిర్యాదులోపేర్కొన్నారుఇందులో భాగంగానే తన నివాసంపై దాడి చేసి అనంతరం ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా సోషల్ మీడియా వేదికలువాట్సాప్ గ్రూపుల ద్వారా అసత్య ప్రచారం నిర్వహించి తన పరువుకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని పిర్యాదు లో పేర్కొన్నారు అలాగే ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రలో భాగమని తన రాజకీయసామాజిక ప్రస్థానాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారని ఫిర్యాదులో  సమాచారం.ఫిర్యాదు ఆధారంగా మేడుదుల అర్జున్ (బోర్నపల్లి) అర్షద్ (హుజురాబాద్)అంజాద్ ఖాన్ (హుజురాబాద్)ఆకునూరి రఘు (సిర్సపల్లి) కందగట్ల మురళి (సిర్సపల్లి)లపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది అందుబాటులో ఉన్న సాక్ష్యాలు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారంఈ కేసు నమోదు కావడం హుజురాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.