హాస్టల్ బాట కార్యక్రమం – విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట
ఘట్‌కేసర్, ఏప్రిల్ 26(ప్రజావాణి): తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఘట్‌కేసర్ ప్రాంతంలో “హాస్టల్ బాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి జీ. వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లోని ఎస్సీ బస్తీలలో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలుసుకుని, వారి పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హాస్టళ్లలో అందుబాటులో ఉన్న మెరుగైన వసతులు, ఉచిత విద్యా సదుపాయాలు, పోషకాహారం వంటి...