హామీల అమలులో “కూటమి” చిత్తశుద్ధేది ? -పిఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులో జాప్యమెందుకు ! -రిలే దీక్షలో యుటిఎఫ్

ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేలు కూటమి ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి లేదని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్, ఏపీ జెఎసి బద్వేలు తాలూకా కన్వీనర్ నరసింహారెడ్డి విమర్శించారు.మంగళవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీని అమలు చేయాలని,ఆర్థిక బకాయిలను తక్షణం చెల్లించాలని,పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం తాలూకా కేంద్రాలలో రిలే దీక్షల కార్యక్రమంలో భాగంగా బద్వేలులోని స్థానిక తహసిల్దార్...