హామీల అమలుపై కోదండరాంను కలిసిన కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి — ముఖ్యమంత్రికి తన తొలి లేఖ దివ్యాంగులకు ఇచ్చిన హామీల పైనే

ఘట్‌కేసర్, ఏప్రిల్ 28 (ప్రజావాణి):  శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాంని ఆయన నివాసంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం ఆధ్వర్యంలో సభ్యులు కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా, ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. దీనిపై...