హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతల నిరసన

ఘట్‌కేసర్, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్‌కేసర్ మండల బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల బీజేపీ అధ్యక్షుడు బస్వ రాజు గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు....