హామీలు అమలు చేయకపోతే గద్దె దింపడం ఖాయం..! పెన్షన్ పెంపుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి: చిప్పల నర్సింగ్ రావు
ఘట్కేసర్, ఏప్రిల్ 17 (ప్రజావాణి): 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధాప్య పెన్షన్‌ను ₹2000 నుండి ₹4000కు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను ₹6000కు పెంచుతామని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల...