హాట్ చిప్స్ సెంటర్లలో డేంజర్ బెల్స్: కల్తీ, నల్లటి నూనెలతో ప్రాణాంతక చిరుతిండ్లు!

కడప జిల్లా జూన్ 02 ప్రజావాణి పోరుమామిళ్ల లోని కొన్ని హాట్ చిప్స్ సెంటర్లలో డేంజర్ బెల్స్  కల్తీ,నల్లటి నూనెలతో ప్రాణాంతక చిరుతిండ్లు స్థానిక హాట్ చిప్స్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా,ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ మరియు పదేపదే మరిగించిన నల్లటి నూనెతో చిరుతిండ్లు తయారు చేస్తున్నారు.సాయంత్రం వేళల్లో కరకరలాడే చిప్స్,సమోసాలు,పకోడీల కోసం జనం ఎగబడుతుండటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు.నల్లటి నూనెతో ఆరోగ్య ముప్పు చిప్స్ తయారీలో ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ఒకసారి వాడిన వంటనూనెను...