హర్‌ ఘర్‌ తిరంగా విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

బెజ్జంకి, ఆగస్టు 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు చేపట్టనున్న తిరంగా యాత్ర, జాతీయ జెండాల పంపిణీ, ఇతర కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. **దేశభక్తిని ప్రతి ఇంటికి చేర్చడమే లక్ష్యం** మండల ఇన్‌చార్జి ముత్యాల జగన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా...