కడపజిల్లాప్రజావాణిన్యూస్ (ఏప్రిల్12)ప్రొద్దుటూరు వైకాప నాయకులపై ప్రొద్దుటూరు కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా ధ్వజం అబద్ధాలనే ఆహారంగా,అబద్ధాలనే ఆయుధంగా చేసుకుని రాజకీయాలు చేసే వ్యక్తి రాచమల్లు.షర్మిల రెడ్డి గారిపై విమర్శలు చేయడంలో కనీసం అదుపు పాటించండని హితువు. షర్మిల గారిని “చిలుక”తో పోల్చడం సబబా? లేక మహిళల పట్ల గౌరవమా?ఎభియాన్ రాధాకృష్ణ గారు మా ఇంటి మహిళలను అవమానించారని అంటూ మీరు ఏబీఎన్ కార్యాలయానికి వెళ్ళి నిరసనలు తెలిపారు అయితే ఇప్పుడు మీరు షర్మిల గారిపై మాట్లాడుతున్న మాటలు అవమానం కాదా?మీ ఇంటి మహిళలకు ఒక న్యాయం… షర్మిల గారికి మరో న్యాయమా?ఇదే మీ ద్వంద్వ వైఖరి, అవసరమైతే మహిళల గౌరవం పేరుతో డ్రామా, లేకపోతే అవమానకర వ్యాఖ్యలు.మహిళలంటే మీకు అంత చిన్న చూపా? మహిళా నాయకురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం మీ సంస్కారాన్ని చూపుతోంది.2029 ఎన్నికల తరువాత వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా “చిలక జోస్యం”చెప్పుకునే పరిస్థితి రాకుండా చేసుకోండి.సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు మాత్రమే స్పందించడం ఎందుకు? షర్మిల గారి ఒక్క మాటకే ఉలిక్కి పడుతున్నారు, సజ్జల గారు, రాచమల్లు గారు వరుసగా పదుల సంఖ్యలో వైకాపా నాయకులు మాట్లాడడం మాట్లాడటం వారి అసహనాన్ని నిదర్శనం.వైస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు “షర్మిల ఫోబియా” పట్టుకుంది, ఇది స్పష్టంగా కనిపిస్తోంది.షర్మిల గారి మాటలకే మీరు ఉలికిపడితే ఆమె అసలు రాజకీయ పోరాటం మొదలైతే తట్టుకోగలరా. ప్రజల సమస్యలపై సమాధానం ఇవ్వలేక,వ్యక్తిగత విమర్శలతో దారి మళ్లించడం,మీ బలహీనతకు నిదర్శనం.ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాషా గారు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా వైకాపా నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు అడుగుతున్న ప్రామాణిక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక,రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరం.ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన సమయంలో దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం.ఒకసారి “ఆస్తుల కోసం మాట్లాడుతున్నారు అంటారు.మరోసారి“చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తున్నారు”అంటారు.అసలు మీ ఆరోపణలకు స్థిరత్వం ఉందా.రేపు ఇంకో కొత్త కథ చెబుతారా?ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ప్రజలకు అవసరం లేదు. మీరు ఒకటి మాట్లాడితే మేము నాలుగు మాట్లాడగలం,మీరు పది మాట్లాడితే మేము వంద మాట్లాడగలం. కానీ మా లక్ష్యం అది కాదు,ప్రజల సమస్యలు,అభివృద్ధి గురించే చర్చ జరగాలి.2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారు.అమరావతి రాజధానిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేసినది ఎందుకు తర్వాత యూ-టర్న్ తీసుకోవడం మీ చిత్తశుద్ధిని ఏమి సూచిస్తుంది?ఎన్నికల ముందు ప్రత్యేక హోదా హామీలు ఇచ్చి,అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోవడం ఎందుకు.కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ఎక్కడికి పోయింది?గత ఐదేళ్లలో అమరావతి అభివృద్ధికి మీరు చేసిన స్పష్టమైన పని ఏమిటి? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మీరు చూపిన దారి ఏమిటి కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రం స్పష్టం చేశారు.రాష్ట్రానికి అప్పులు కాదు, కేంద్రం నుంచి గ్రాంట్లు రావాలి ప్రత్యేక హోదా కావాలి.ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం ఠాగూర్ గారు పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పారు.కానీ వైకాపా ఎంపీలు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని అభివృద్ధిపై మాట్లాడాలని సూచిస్తున్నాం.మహిళల గౌరవం గురించి మాట్లాడే మీరు అదే సమయంలో శ్రీమతి వైఎస్ శర్మిల గారిని “చిలుక”తో పోల్చడం ఎంతవరకు సమంజసం అది అవమానం కాదా మీకు అవమానం అంటే selectiveగా మాత్రమే అనిపిస్తుందా?ఒకవైపు మహిళల గౌరవం అంటూ మాట్లాడటం,మరోవైపు అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఇది మీ ద్వంద్వ వైఖరికి స్పష్టమైన ఉదాహరణ.షర్మిల గారు ఒక సాధారణ నాయకురాలు కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు, ప్రజల మధ్య పెరిగిన నాయకురాలు,ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరాడుతున్న మహిళా శక్తి.ఆమె ఎవరి స్క్రిప్ట్ మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె స్వతంత్ర నాయకురాలు,ప్రజల కోసం నిలబడే నాయకురాలు.మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఒక కులానికి మాత్రమే పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఆ కులం పేరు చెప్పే ధైర్యం మీకు ఉందా.ఆ కులం ఓట్లు మాకు వద్దని చెప్పగలరా.ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే.ఇప్పటివరకు షర్మిల గారు 150కి పైగా ప్రజా సమస్యలపై కార్యక్రమాలు,పోరాటాలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైతుల సమస్యలు, వరద బాధితుల వరకు ప్రతీ అంశంపై ముందుండి పోరాడారు. ఇలాంటి నాయకురాలిపై మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?మీ రాజకీయాలు మాత్రం కులాలు,మతాలు మధ్య చిచ్చు పెట్టేవిగా మారాయి. రాజకీయాలు అంటే అభివృద్ధి,ప్రజల సమస్యలు అవే మాట్లాడాలి.చిల్లర విమర్శలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు.మహిళలు ప్రశ్నించకూడదా రాజకీయాలు చేయకూడదా.మీకు ఇబ్బంది అదేనా.షర్మిల గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా ధైర్యంగా ప్రశ్నిస్తుంటే,మీరు తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు కఠినంగా ఉంటుంది.చివరిగా ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం,ఇలాంటి చౌకబారు మాటలు,అవమానకర వ్యాఖ్యలు చేస్తే.ప్రజలే మీకు గట్టిగా సమాధానం చెబుతారు.