హబ్సిగూడకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన సైట్ సూపర్‌వైజర్

పోచారం, జూలై 29: హబ్సిగూడలోని బ్యాంకుకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ఓ వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు గల్లంతు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్‌రూం కాలనీ, 7వ బ్లాక్, 2వ అంతస్తులో నివాసముంటున్న కేడాసు లావణ్య తన భర్త కేడాసు ప్రకాశ్ (35) కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ప్రకాశ్ సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, 2018లో...