హనుమంత్ రావుకు ప్రభుత్వ సలహాదారుగా నియామకం… మర్యాదపూర్వకంగా కలిసిన వేముల మహేష్ గౌడ్
ఘాట్కేసర్, మే 1 (ప్రజావాణి): కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావును తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడాన్ని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వెనుకబడిన తరగతులు, ఎస్సీ/ఎస్టీ వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,...