prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 2:57 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

హనుమంత్ రావుకు ప్రభుత్వ సలహాదారుగా నియామకం… మర్యాదపూర్వకంగా కలిసిన వేముల మహేష్ గౌడ్

ఘాట్కేసర్, మే 1 (ప్రజావాణి):   కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావును తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడాన్ని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వెనుకబడిన తరగతులు, ఎస్సీ/ఎస్టీ వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గాంధీ భవన్‌లో వి. హనుమంత్ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్, యువ నాయకులు వేముల మణిశరన్ గౌడ్, వేముల వంశీ గౌడ్, దొంకేన శివ గౌడ్, గోడల ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.