గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) పోలీస్.స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి.సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్,ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ జి.వి.రమణమూర్తి,శ్రీ ఏ.హనుమంతు,మరియు ఇతర పోలీసు అధికారులు కలిసి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ,అల్లూరి సీతారామరాజు,భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి,అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.స్వేచ్ఛ,స్వాభిమానం,ధర్మం కోసం ఆయన చేసిన పోరాటం యువతకు మార్గదర్శకమని,దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయాలనే స్ఫూర్తిని ఆయన జీవితం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.సమాజ హితం కోసం,దేశ రక్షణ కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు.పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు సేవా భావం,క్రమశిక్షణ,ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పని చేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు.అలాగే నేటి యువత స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలుసుకొని దేశభక్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు.స్వార్థం,లోభం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం ద్వారానే నిజమైన దేశసేవ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తో పాటు పోలీస్కా ర్యాలయ.వసంతరావు,జగన్నాథరావు,సురేష్,శ్రీహరిరెడ్డి,పలువురు పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొని శ్రీ అల్లూరి సీతారామరాజు,సేవలను స్మరించుకున్నారు