స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమాల సమరశీలి కామ్రేడ్ యాలూరి స్వామి రెడ్డి,113వ జయంతి సందర్భంగా నివాళి
బేతంచెర్ల,జూలై 02ప్రజావాణి నంద్యాల జిల్లా.బేతంచర్ల పట్టణంలోని సీపీఐ కార్యాలయం నందు.స్వాతంత్ర్య సమరయోధుడు,ఉమ్మడి కర్నూలు సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యాలూరి స్వామిరెడ్డి 113వ జయంతి సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్.యన్న,సహాయ కార్యదర్శులు తాలూకా తిరుమలేష్,డి.దస్తగిరి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మధు,సీపీఐ నాయకులు భాస్కర్,ఉదయ్, శివ ల ఆధ్వర్యంలో కామ్రేడ్ స్వామి రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల కబంద హస్తాల లో శతాబ్దాల తరబడి బానిసత్వంలో మగ్గిపోయిన భరతమాత ఉక్కు సంకెళ్లను తొలగించేందుకు,స్వాతంత్ర్య సమరయోధుల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు...