స్మార్ట్ పోలీసింగ్ తో రాష్ట్రంలోనే అగ్రగామిగా జిల్లాను నిలిపేందుకు కృషి చేయాలి, రౌడీ లు,అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలి.కడప జిల్లా ఎస్.పి
కడప (మే30 ప్రజావాణి) స్మార్ట్ పోలీసింగ్ ఇండికేటర్స్ అయిన, ఈ-సాక్ష్య,సి.సి.టి.ఎన్.ఎస్,ఈ- సమ్మన్స్ తదితర మాడ్యూల్స్ పై పట్టు పెంచుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా నిలిపేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు సూచించారు.శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి స్మార్ట్ పోలీసింగ్ పై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్...