బెజ్జంకి,జూన్ 29 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట పోలింగ్ స్టేషన్ నెం. 238లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని బెజ్జంకి తహశీల్దార్ శ్రీకాంత్ పరిశీలించారు.ఈ సందర్బంగా ఎన్నికల ఎన్యూమరేటర్లు సేకరిస్తున్న దరఖాస్తు ఫారాలను పరిశీలించి,నమోదు ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా,వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.