స్నేహం… జీవితాన్ని సంపన్నం చేసే అదృశ్య సంపద
ప్రపంచంలో మనిషి సంపాదించే గొప్ప సంపద ఏమిటి? ధనమా? పదవా? కీర్తియా? కాదు... కాలం పరీక్షను తట్టుకుని నిలిచే స్నేహం. మనిషి పుట్టినప్పుడు బంధాలను వెంట తెచ్చుకుంటాడు. కానీ జీవిత ప్రయాణంలో తన హృదయంతో సంపాదించుకునేది మాత్రం స్నేహమే. అందుకే స్నేహం అనేది రక్తంతో ఏర్పడిన బంధం కాదు... హృదయంతో నిర్మించుకున్న ఆత్మీయ అనుబంధం. భారతీయ సంస్కృతిలో స్నేహానికి నిలువెత్తు నిదర్శనం శ్రీకృష్ణుడు–కుచేలుడు. ఒకరు ద్వారకాధీశుడు, మరొకరు నిరుపేద బ్రాహ్మణుడు. స్థితిగతులు మారాయి, సంపద మారింది, రాజ్యం మారింది. కానీ వారి స్నేహం మాత్రం...