స్టేషన్‌కే ఆలయ కళ,,చిన్న తిరుపతి మాదిరిగా మారిన ఏలూరు రైల్వే జంక్షన్
ఏలూరు ప్రజావాణి న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రంగానికి కొత్త రూపు తీసుకొస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం ఇప్పుడు ఏలూరును మరోసారి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒకప్పుడు సాధారణ ప్రయాణికుల రాకపోకలకే పరిమితమైన ఏలూరు రైల్వే స్టేషన్, ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంటోంది. స్టేషన్ భవనం ముందు నిలబడి చూస్తే అది రైల్వే స్టేషన్ కంటే ఒక ప్రసిద్ధ దేవాలయ ప్రవేశ ద్వారం అనిపించేలా రూపుదిద్దుకోవడం విశేషం.కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏలూరు స్టేషన్‌ను ఆధునిక...