సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,

ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్10)సోషల్ మీడియాలో తెలిసిన వ్యక్తుల నుండి డబ్బులు “అత్యవసరం” అంటూ డబ్బులు అడిగితే వెంటనే స్పందించకండి,ముందుగా ఫోన్ చేసి నిర్ధారించుకోండి.సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ల ప్రొఫైల్‌ను లాక్ చేసి ఉంచడం మరింత భద్రతకు మంచిది: జిల్లా ఎస్పీ గారు.సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, కొందరు సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లకు నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ గారు తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నవారు ముందుగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించి,ప్రైవసీ...