సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ఒక వ్యక్తిపై కేసు నమోదు – టూ టౌన్ పోలీసు హెచ్చరిక..
సిద్దిపేట్, మార్చి 20, ప్రజావాణి సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను వక్రీకరించి, మత సామరస్యానికి భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తిపై సిద్దిపేట టూ టౌన్ లో కేసు నమోదు.సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా ఉన్న ధరిపల్లి వెంకటయ్య అనే వ్యక్తికి చెందిన స్వంత స్థలంలో, వారి తాతముత్తాతల కాలం నుండి పెద్ద గుట్ట దర్గాకు గుర్తుగా ఒక పురాతన చిల్లా ఉంది. ఆ చిల్లా కొంత కాలంగా శిథిలావస్థకు చేరడంతో, యజమానులు దానికి మరమ్మతులు (రిపేరు) చేపట్టి పునర్నిర్మిస్తున్నారు....