prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:09 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సోమిరెడ్డి ఇలాఖాలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తరలింపు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్) సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిక్కవరప్పాడు నుండి గొలగమూడికి యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తరలింపు గ్రావెల్ అక్రమ తరలింపు దారులకు సోమిరెడ్డి అండదండలు గ్రావెల్ తరలింపు ట్రాక్టర్ ల ను అడ్డుకున్న స్థానికులతో తాము ఏఎంఆర్( AMR)సంస్థకు రాయల్టీ చెల్లించామని దబాయిస్తున్న వాహనదారులు మైనింగ్ అనుమతులు లేకుండా రాయల్టీ చెల్లించామన్న పేరుతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడం లేదంటూ స్థానికుల ఆగ్రహం మైనింగ్ అనుమతులు ఉంటేనే ఏఎంఆర్ సంస్థ రాయల్టీ లు వసూళ్ళు చేయాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నా , వాటిని బేఖాతరు చేస్తూ ఏఎంఆర్ (AMR) సంస్థ ఇష్టారాజ్యంగా రాయల్టీ వసూళ్లు ఏఎంఆర్ సంస్థకు రాయల్టీలు చెల్లించి మైనింగ్ శాఖ అనుమతులు లేకున్నా, అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ ను తామే అడ్డుకోవడానికి సిద్ధపడుతున్న ప్రజలు గ్రావెల్ అక్రమ తరలింపును అడ్డుకుంటే సోమిరెడ్డి ఆదేశాలతో ఆగమేఘాల మీద పోలీసులు రావడం, అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేయడం సర్వేపల్లి లో పరిపాటిగా మారింది అంటున్న స్థానికులు ప్రజలే తిరగబడి ప్రకృతి సహజ సంపదను కొల్లగొడుతున్న అక్రమ దారులను ఎదిరించి, వారి బారి నుండి ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలనే ఆలోచనలో గ్రామస్తులు జిల్లాలో ఇష్టారాజ్యంగా అక్రమంగా గ్రావెల్ ,మట్టి తరలించుకుపోతున్నా ఏమాత్రం పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారుల పై ప్రజలు తీవ్రమండి పాటు జిల్లా కలెక్టర్ గారైనా జోక్యం చేసుకొని, మైనింగ్ అనుమతులు లేకుండా తరలిస్తున్న అక్రమ గ్రావెల్ రవాణాను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్న ప్రజలు