prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 8:34 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు.

జగ్గయ్యపేట జూన్ 7 ప్రజావాణి నియోజకవర్గం,నందిగామ మండలం సోమవరం గ్రామంలో గత ఏడాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ప్రారంభించిన మ్యాజిక్ డ్రైనేజీల పనితీరును పరిశీలించడానికి విచ్చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు,తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను.మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి.మ్యాజిక్ డ్రైనేజీలను పరిశీలించిన తరువాత గ్రామ ప్రజలతో మాట్లాడిన నాగబాబు,డ్రైనేజీల వల్ల మురుగు నీటి సమస్యలు తగ్గి పారిశుధ్యం మెరుగుపడిందని గ్రామ ప్రజల ద్వారా తెలుసుకున్నారు.గ్రామాభివృద్ధి,పారిశుధ్యం మరియు ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగబాబు.తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.