సైబర్ నేరాల నియంత్రణకే ‘సురక్ష కా తిరంగా”-రేగులపల్లిలో విద్యార్థులకు అవగాహన కల్పించిన సిద్ధిపేట రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్

బెజ్జంకి, ఆగస్టు 6 (ప్రజావాణి) సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే మోసాల నుంచి రక్షణ పొందవచ్చని సిద్ధిపేట రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్ అన్నారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘సురక్ష కా తిరంగా’ సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా రేగులపల్లి గ్రామంలోని సెయింట్ వీన్సెంట్ పల్లొట్టి ఉన్నత పాఠశాలలో బహిరంగ సమావేశం, అవగాహన ర్యాలీ నిర్వహించారు.బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన...