prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:38 am Digital Edition : PRAJA VANI

సైబర్ నేరాలపై విస్తృత అవగాహన

సైబర్ నేరాలపై విస్తృత అవగాహన
.. సారంగపల్లిలో పోలీసుల భారీ తనిఖీలు
మందమర్రి, (మన ప్రజావాణి) మే 12:

మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామంలో మందమర్రి పోలీసులు మంగళవారం సాయంత్రం వేళ ఆకస్మిక కార్డన్ సెర్చ్  నిర్వహించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
క్షుణ్ణంగా వాహనాల తనిఖీ  చేసి 35 వాహనాలు సీజ్ చేశారు.
సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. బైకులు, ఆటోలను ఆపి వాటికి సంబంధించిన ఆర్.సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్‌లను తనిఖీ చేశారు.
సరైన ధృవీకరణ పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 35 మోటార్ సైకిళ్లు, ఆటోలను  గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
తనిఖీల అనంతరం నిర్వహించిన సదస్సులో అధికారులు ప్రజలకు సైబర్ నేరాల ముప్పు గురించి వివరించారు:సైబర్ నేరగాళ్ల మాయలో పడకండి.
ఓటిపి లేదా వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పవద్దు.
ఆన్‌లైన్ లింకులు, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దు. అవి మీ ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఒకవేళ పొరపాటున సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.గ్రామంలో అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే 100 కి డయల్ చేయాలని కోరారు.
నేరస్తులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
పర్స రమేష్ మందమర్రి సర్కిల్ ఇన్ స్పెక్టర్,
జి. నరేష్ మందమర్రి ఎస్ఐ,
శ్రీధర్  రామకృష్ణాపూర్ ఎస్ఐ, ఇతర 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సాయంత్రం వేళ నిర్వహించిన ఈ తనిఖీలతో గ్రామస్తులు పోలీసుల పనితీరును అభినందించారు.