సైన్యంలో చేరేందుకు ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన తల్లి: అబుదాబి నుంచి కొడుకుని రప్పించాలని వినతి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 25 (ప్రజావాణి): భారత సైన్యంలో 'అగ్నివీర్'గా చేరి దేశసేవ చేయాలన్న తన కుమారుడి కల నెరవేర్చేందుకు ఓ తల్లి ప్రభుత్వం సాయాన్ని కోరారు. అబుదాబిలో చిక్కుకున్న తన కొడుకుని అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో నిర్వహించిన 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన కొప్పర్తి అభిలాష్, స్థానిక గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై ఈ...