సెకండరీగ్రేడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావాణి న్యూస్: (మార్చి 07) గ్రేడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించి,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని ఏఐఎఫ్ఇటిఓ(ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్) జాతీయ కార్యదర్శి పి.రమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.ఏఐఎఫ్ఇటిఓ జాతీయ కార్యదర్శి గా నియమితులైన ఎస్టీయూ రాష్ట్రనాయకుడు పి.రమణారెడ్డికి ఎస్టీయు మండలశాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.సత్యనారాయణ, ఎం.బాలరాజు నాయక్ ల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కలసపాడులో సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎస్జీటీగా నియామకం పొంది సుమారు 30 నుండి 35 సంవత్సరాలు సర్వీసు చేసిన తరువాత...