జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో బుధవారం రోజున భూ సర్వే, రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత ముఖ్య అతిథిగా హాజరై, సర్వే ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. ఈ సదస్సులో మండల తహసీల్దార్ ఎ అనిల్ కుమార్, స్థానిక సర్పంచ్ కొడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్, గిర్దావర్ టి అన్వేష్, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.