సూరారం గ్రామంలో విషాదం, వడదెబ్బతో రైతు మృతి
వ్యవసాయ పనుల్లో ఉండగా వడదెబ్బతో రైతు మృతి జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 30 (ప్రజావాణి): ఎండల తీవ్రతకు జగిత్యాల జిల్లాలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయారు. ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన జాడీ లచ్చయ్య (62) అనే రైతు ఏప్రిల్ 29, బుధవారం రోజున తన వ్యవసాయ పొలంలో పంట కోత పనుల్లో నిమగ్నమై ఉండగా వడదెబ్బకు గురయ్యారు. పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై లచ్చయ్య స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు...