సుల్తాన్ పురం గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ.
సుల్తాన్ పురం గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ. మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని సుల్తాన్ పురం గ్రామంలో బంజారాల సాంప్రదాయ అతిపెద్ద పండగ అయిన తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. తొమ్మిది రోజులు పెళ్లి కానీ యువతులు మేరమా యాడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అదేవిధంగా గ్రామస్తులందరూ ఇట్టి పండుగను వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, పశువులు బాగుండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ పండుగ...