prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:20 am Digital Edition : PRAJA VANI

సుమన్ నివాసాన్ని సందర్శించిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

*సుమన్ నివాసాన్ని సందర్శించిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్*

*మన ప్రజావాణి* *మందమర్రి* జూన్ 2
అధికారక పర్యటనలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్ తన తిరుగు ప్రయాణంలో పట్టణంలో నివాసం ఉండే తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన జిల్లా అధ్యక్షుడు, పాత్రికేయుడు గరిగే సుమన్ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుమన్ – భూమిక దంపతులు ఆయనను శాలువాతో శాలువాతో ఘనంగా సన్మానించి, ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా పట్టణం ముదిరాజ్ సంఘం నాయకులు, పలువురు, పలు సంఘాల నాయకులు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సుమన్ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, మత్స్య శాఖ వరంగల్ జిల్లా అధ్యక్షులు చొప్పరి సోమయ్య, ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ సానబోయిన రాజ్ కుమార్, మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.