prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 9:38 am Digital Edition : VENU THIRUMALAYAPALEM

సుబ్లేడు డాక్టర్ వసుంధరకు ఉత్తమ ప్రతిభ అవార్డు..

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం.

గ్రామీణ ఆరోగ్య సేవలకు గుర్తింపు

ప్రజల్లో అవగాహన పెంచిన వైద్యురాలు.

సేవలకు ఘన సత్కారం..

ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ వసుంధర

తిరుమలాయపాలెం,ప్రజావాణి:

తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన డాక్టర్ వసుంధరకు విశిష్ట గౌరవం లభించింది. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు “ఉత్తమ ప్రతిభ అవార్డు” ప్రదానం చేశారు.ఈ అవార్డును జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. గ్రామీణ స్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన కోసం సమర్థవంతంగా పనిచేస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, రోగుల గుర్తింపు మరియు చికిత్సలో చురుకైన పాత్ర పోషించినందుకు ఈ గౌరవం దక్కింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, డాక్టర్ వసుంధర గ్రామ ప్రజల ఆరోగ్యానికి అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆమె సేవలు గ్రామీణ ఆరోగ్య రంగానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.అధికారులు కూడా డాక్టర్ వసుంధర సేవలను ప్రశంసిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వైద్యుల సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సహచర వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామస్తులు ఆమెకు అభినందనలు తెలిపారు.గ్రామీణ ఆరోగ్యాభివృద్ధికి కృషి చేసిన వసుంధరకు ఈ అవార్డు మరింత ప్రేరణనిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.ఈ కార్యక్రమంలో తాళ్ల మల్లయ్య, పల్లి జనార్ధన్, ఖాన్ పార్టీ ఉపేందర్, గోపోజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.