కడప ప్రజావాణి న్యూస్(మార్చి26)సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లు మరియు మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పుపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యకాస జిల్లా కార్యదర్శి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.రిజర్వేషన్లను మతంతో అనుసంధానం చేయడం పూర్తిగా అభ్యంతరకరం.గౌరవ న్యాయస్థానం ఈ తీర్పును వెంటనే రివ్యూ చేయాలని కోరుతున్నాము.అలాగే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి,మతానికి,రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొనాలి. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయో గుర్తు చేసుకోవాలి.శతాబ్దాలుగా దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం,సామాజిక వివక్ష,ఆర్థిక-విద్యా వెనుకబాటుతనం నుండి బయటపడేందుకు రాజ్యాంగం ప్రత్యేక హక్కుగా రిజర్వేషన్లను కల్పించింది.ఇవి మతానికి సంబంధించినవి కాదు;ఇవి సామాజిక న్యాయం సాధించడానికి తీసుకున్న చారిత్రక చర్యలు.మన దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఏ మతాన్ని అనుసరించవచ్చు.కానీ అదే స్వేచ్ఛ దళితులకు వర్తించదా.మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందా.ఇది స్పష్టమైన అన్యాయం. ఒకవైపు మత స్వేచ్ఛను కల్పిస్తూ మరోవైపు హక్కులను కత్తిరించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.దళితులు ఇతర మతాలలోకి మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు అనే తీర్పు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.ఈ తీర్పును అమలు చేయవద్దని సుప్రీంకోర్టును కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి.సమాజంలో ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతోంది.వారు మతం మార్చుకున్నా ఆ వివక్ష తగ్గదు.కాబట్టి మతాన్ని ఆధారంగా చేసుకుని హక్కులను నిరాకరించడం పూర్తిగా తప్పు.ఈ తీర్పు హిందుత్వ శక్తులకు ఆయుధంగా మారి,దళితులపై దాడులు మరింత పెరగడానికి దారి తీసే ప్రమాదం ఉంది.అంటరానితనాన్ని నిర్మూలించడానికి వచ్చిన రిజర్వేషన్లను బలహీనపరచే ఏ చర్యనైనా అంగీకరించలేం.సామాజిక న్యాయం స్థానంలోకి మనుధర్మాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీనిపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి.రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలు ఈ అంశంపై తీర్మానాలు ఆమోదించి,కేంద్రానికి రాజ్యాంగ సవరణ కోసం పంపాలి సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం.దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దళితులను గుడిలోకి అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగానే వారు చర్చిలకు వెళ్తున్నారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోంది. దళితులు మతం మార్చుకున్నా వివక్ష పోదు.కాబట్టి సామాజిక న్యాయం సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి,దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి.ఈ క్రింది డిమాండ్స్పను సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రివ్యూ చేయాలి మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు