సీనియర్ కాంగ్రెస్ నేత గుర్రం వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

హుజూర్నగర్ ప్రజావాణి:సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గుర్రం వెంకటరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటరెడ్డి మరణ వార్త తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా చిరకాల మిత్రుడు, ఆప్తుడు, శ్రేయోభిలాషి అయిన వెంకటరెడ్డి మృతి అత్యంత బాధాకరమని అన్నారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి,...