prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 2:07 pm Digital Edition : NARESH HUZURNAGAR

సీనియర్ కాంగ్రెస్ నేత గుర్రం వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

హుజూర్నగర్ ప్రజావాణి:సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గుర్రం వెంకటరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
వెంకటరెడ్డి మరణ వార్త తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా చిరకాల మిత్రుడు, ఆప్తుడు, శ్రేయోభిలాషి అయిన వెంకటరెడ్డి మృతి అత్యంత బాధాకరమని అన్నారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చిన మంత్రి, వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.వ్యక్తిగతంగా సుదీర్ఘ కాలంగా పరిచయం ఉన్న వెంకటరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందారని మంత్రి తెలిపారు.విద్యా కమిటీ చైర్మన్‌గా, ఎంపీటీసీగా సేవలందించిన ఆయన గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహానుభావుడైన వెంకటరెడ్డి సేవలను పార్టీ ఎప్పటికీ మరువలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.