సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి – డీఎంహెచ్‌వో డా. సీహెచ్ ధనరాజ్
బెజ్జంకి,జూలై 19 (ప్రజావాణి) సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డా. సీహెచ్ ధనరాజ్ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఓపీ నిర్వహణ, రికార్డులు, ప్రయోగశాల, ఫార్మసీ, ఔషధ నిల్వలు, వ్యాధి నిరోధక టీకాల లభ్యత, శీతలీకరణ వ్యవస్థలను పరిశీలించారు. ఓపీకి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.ప్రభుత్వ...