సీఎం కప్ –2026 జిల్లా స్థాయి పోటీల్లో ఏహెచ్ఎస్ ఉప్పుసాక విద్యార్థుల ప్రతిభ
మన ప్రజా వాణి ప్రతినిధి
బూర్గంపాడు
ఫిబ్రవరి 11:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో నిర్వహించిన సీఎం కప్ –2026 జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఏహెచ్ఎస్ ఉప్పుసాక పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాల నుండి మొత్తం ఐదుగురు విద్యార్థులు రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్నారు.
రెజ్లింగ్ పోటీల్లో పి. సాయికుమార్ (10వ తరగతి) 45 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా, టి. ఆకాష్ (9వ తరగతి) 48 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో అండర్–16 లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్, అండర్–14 విభాగంలో 600 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయి CM CUP పోటీలకు ఎంపికయ్యారు.
విద్యార్థుల ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ్ల పిచ్చయ్య, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ కొమర వెంకటనారాయణ, డిప్యూటీ వార్డెన్ రాజేష్, పీఈటీలు కే. శశికళ, కే. రాజశేఖర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులందరూ అభినందనలు తెలియజేశారు.